: ట్రంప్ తో జపాన్ ప్రధాని భేటీ


అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత ఆయనను తొలిసారిగా ఒక విదేశీ ప్రధాని కలిశారు. న్యూయార్క్ లోని ట్రంప్ టవర్స్ లో డొనాల్డ్ ట్రంప్ తో జపాన్ ప్రధాని షింజో అబె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షింజో అబె మాట్లాడుతూ, అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత ఆయనను కలిసిన తొలి విదేశీ నేతను తానే కావడం తనకు దక్కిన గౌరవమన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ట్రంప్, అబెల మధ్య జరిగింది ప్రైవేట్ మీటింగ్ అని, ఈ ఇద్దరూ నేతలు సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారని ట్రంప్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News