: ఆరు నెలల ముందు ఉర్జిత్ సంతకమెలా వచ్చింది?: నోట్ల రద్దుపై లా పాయింట్ తీసిన నటి రమ్య


నల్లధనాన్ని బయటకు తీయడానికి ఆరు నెలల నుంచి నోట్ల రద్దుపై కసరత్తు చేస్తూ, ప్రణాళికలను సిద్ధం చేశామని, అప్పటి నుంచే కొత్త నోట్ల ముద్రణ జరిగిందని కేంద్ర చెప్పడాన్ని కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య తీవ్రంగా ఆక్షేపించారు. ఆరు నెలల క్రితం ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ లేరని, రఘురాం రాజన్ ఉన్న సమయంలో ముద్రించబడ్డ నోట్లపై ఉర్జిత్ సంతకం ఎలా వచ్చిందని ఆమె కొత్త లా పాయింట్ తీశారు. ఇందులో కూడా రాజకీయాలు ఉన్నాయని, నోట్ల రద్దును ప్రకటించే పూర్వమే బీజేపీ నేతలకు పెద్దఎత్తున కొత్త నోట్లు చేరిపోయాయని ఆమె ఆరోపించారు. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఇబ్బందులు దూరం చేసే చర్యలేవీ కేంద్రం తీసుకోలేదని అన్నారు.

  • Loading...

More Telugu News