: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం.. గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై మండిపాటు.. రాజ్యసభలో గందరగోళం
పార్లమెంటు శీతాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ ప్రారంభం కావడమే ఆలస్యం.. ఈ రోజు కూడా పెద్దనోట్ల రద్దుపై చర్చ చేపట్టవలసిందేనని ప్రతిపక్ష నేతలు ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. డిప్యూటి ఛైర్మన్ కురియన్ ఎంత నచ్చజెప్పినా విపక్షనేతలు ససేమిరా అంటున్నారు. మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించడమే లక్ష్యంగా చర్చకు పట్టుబడుతున్నారు. మరోవైపు అధికార పక్షనేతలు గులాం నబీ ఆజాద్ నిన్న చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మరోవైపు లోక్‌సభలోనూ పెద్దనోట్ల రద్దు అంశంపై చర్చ ప్రారంభమైంది. అయితే గందరగోళం నెలకొనడంతో లోక్‌సభను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రామహాజన్ పేర్కొన్నారు.