: 'సైరాత్' రీమేకే... కుమార్తె సినీ రంగ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన బోనీ కపూర్!


తన కుమార్తె జాన్వీ కూడా తల్లి శ్రీదేవి బాటలో సినిమాల్లో నటిస్తుందని బోనీ కపూర్ స్పష్టం చేశాడు. ఆమె కరణ్ జొహార్ చిత్రంలో తొలిసారిగా నటిస్తుందని వెల్లడించిన బోనీ కపూర్, ఆయన వద్ద మరాఠీ హిట్ మూవీ 'సైరాత్' హక్కులున్నాయని, జాన్వీ లాంచ్ ఆ సినిమాయే కావచ్చునని అనుకుంటున్నామని తెలిపాడు. జాన్వీ కెరీర్ గురించి బోనీ వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక కరణ్ తెరకెక్కిస్తున్న మరో చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' జాన్వీ తొలి చిత్రం కావచ్చని వార్తలు వచ్చినప్పటికీ, బోనీ కపూర్ తాజా స్టేట్ మెంట్ తో అది వాస్తవం కాదని తేలిపోయింది. కాగా, గతంలో మహేశ్ - మురుగదాస్ చిత్రం కోసం జాన్వీని సంప్రదించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News