: గులాం నబీ సంచలన వ్యాఖ్యలు పార్లమెంట్ రికార్డుల నుంచి డిలీట్


యూరీ ఉగ్రదాడిని, దేశంలో పెద్ద నోట్ల రద్దును పోలుస్తూ, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన సంచలన వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. నిన్న ఆయన ప్రసంగిస్తూ, యూరీ దాడిలో 20 మంది మాత్రమే చనిపోయారని, మోదీ సర్కారు దుర్మార్గపు నిర్ణయంతో క్యూల్లో నిలబడ్డ 40 మంది చనిపోయారని, దీనికి ఎవరిని శిక్షించాలని ఆవేశంగా ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపగా, ఆజాద్ తప్పు చేశారని వెంకయ్యనాయుడు దుయ్యబట్టారు. పాక్ ను సమర్థిస్తున్నట్టు మాట్లాడటం సరికాదని, ఆయన మాటలు జాతి వ్యతిరేకమని పలువురు ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో గులాం చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News