: రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాదనే అనుకుంటున్నాను: పుజారా


విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నానని ఛటేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డాడు. తొలి రోజు ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం పుజారా మాట్లాడుతూ, తన బ్యాటింగ్‌ పట్ల సంతృప్తిగా ఉన్నానని అన్నాడు. కెప్టెన్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని, అశ్విన్ క్రీజులో అడుగుపెట్టగా, సాహా, జడేజా, షమి తదితరులు ఇంకా బ్యాటింగ్ చేయాల్సి ఉందని, దీంతో తొలి ఇన్నింగ్స్ లో 500 కు పైగా స్కోర్ చేసేందుకు అవకాశం ఉందని, తమ జట్టు ఆ స్కోరు చేస్తుందని ఆశిస్తున్నానని పుజారా తెలిపాడు. ఆట కొనసాగే కొద్దీ పిచ్ గరుకుగా మారుతుందని పుజారా చెప్పాడు. ఇండియా బౌలింగ్ కు దిగే సమయానికి పిచ్ స్పిన్నర్లకు సహకరించనుందని పేర్కొన్నాడు. దీంతో రెండోసారి తాము బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాదనే తాను భావిస్తున్నానని పుజారా ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News