: సీఎం చంద్రబాబుకు భద్రత పెంపు.. కేబినెట్ నిర్ణయం
ఏపీ సీఎం చంద్రబాబుకు భద్రతను భారీగా పెంచారు. ఏవోబీలో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందనే సమాచారం నేపథ్యంలో చంద్రబాబుకు భద్రతను మరింత పెంచాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు భద్రతకు సంబంధించి సీఎం సెక్యూరిటీ గ్రూప్ (సీఎంఎస్ జీ) లో కొత్తగా 290 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఈ మేరకు ఒక జీవో జారీ చేసింది. ఇందులో ఐదుగురు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 23 మంది ఇన్ స్పెక్టర్లు, 51 మంది ఆర్ఎస్ఐ లు వుంటారు. మిగిలిన పోస్టుల కింద కానిస్టేబుల్స్ ను భర్తీ చేస్తారు.