: భర్త వియోగం, కొడుకు క్యాన్సర్ ఆమెను ఇబ్బంది పెట్టలేదు... బ్యాంకు సిబ్బంది మాత్రం ఆమెను బాధపెట్టారు!


ఉత్తరప్రదేశ్ లోని లక్నో సమీపంలోని మోహన్‌ లాల్‌ గంజ్‌ కు చెందిన సర్జుదేవి (60) భర్తను కోల్పోయింది. చేతికందివచ్చిన కుమారుడు క్యాన్సర్‌ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. అయినా వీటికి ఆమె ఎప్పుడూ బాధపడలేదు. బాధ్యతగా స్వీకరించి వాటిని భరిస్తోంది. అయితే, పెద్ద నోట్ల కారణంగా ఎదురైన ఘటన మాత్రం ఆమెకు తీరని వేదన మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే... సర్జుదేవి కష్టాలు చూసిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆమెకు లక్ష రూపాయల సహాయం చేశారు. ఆ డబ్బుతోనే ఆమె తన కుమారుడు రామ్ కుమార్ కు వైద్యం చేయిస్తోంది. అయితే నోట్ల రద్దుతో గత మూడు రోజులుగా కుమారుడికి రేడియో థెరఫీ చేయించలేదు. అది చేయించేందుకు డబ్బుల కోసం ఆమె బ్యాంకుకు వచ్చింది. అయితే బ్యాంకు అధికారులు ఆమెకు 2000 రూపాయల చిల్లర నాణాలు ఇచ్చారు. తన కుమారుడికి వైద్యం చేయించాలని, నోట్లు ఇవ్వాలని ఆమె బ్యాంకు అధికారులను కోరినప్పటికీ వారు కనికరించకపోవడం విశేషం. నచ్చితే తీసుకెళ్లు లేకపోతే మానెయ్ అని సమాధానం ఇవ్వడంతో, కుమారుడి వైద్య పరీక్షల కోసం ఆ 17 కేజీల బరువైన నాణేలను అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడితోనే మోయించి తీసుకెళ్లింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News