: వాహనదారులకు ఊరట.. టోల్‌గేట్ల రుసుం రద్దు గడువును మరోసారి పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
నల్లధనాన్ని, నకిలీనోట్లను అరికట్టడానికి ఈ నెల 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో టోల్‌గేట్ల వద్ద వాహనదారులు తీవ్ర అవస్థలు పడిన సంగతి తెలిసిందే. జాతీయ రహదారులపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో మూడు రోజుల పాటు టోట్‌గేట్ల రుసుముని రద్దు చేస్తున్నట్లు ఆ వెంటనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే, దేశంలో కొత్త నోట్లు, కావలసినంత చిల్లర ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో ఆ తరువాత కూడా మరో రెండుసార్లు టోల్ గేట్ల రుసుం గడువును పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఈ రోజు సాయంత్రం మరోసారి వాహనదారులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. టోల్ గేట్ల రుసుం రద్దు గడువును ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.