: రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలను అధికార పక్ష నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉరీ ఘటనకు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు అంశాన్ని ముడిపెడుతూ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం పట్ల అధికార పక్షనేతలు అభ్యంతరం తెలుపుతూ ఆజాద్ నుంచి సభలోనే వివరణ కోరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపైనే చర్చించడానికి వెంకయ్యనాయుడు ఛాంబర్‌లో కేంద్రమంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.