: అచ్చొచ్చిన వైజాగ్ లో సిక్సర్ తో పుజారా, బౌండరీతో కోహ్లీ సెంచరీల పూర్తి!
అచ్చొచ్చిన వైజాగ్ లో టీమిండియా డిపెండబుల్ ఆటగాళ్లు ఛటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ సెంచరీ సాధించారు. ఓపెనర్ల వికెట్లను స్వల్ప వ్యవధిలో కోల్పోయిన టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి పుజారా ఇన్నింగ్స్ నడిపించాడు. ఇద్దరూ నిలకడగా ఆడుతూ సెంచరీల దిశగా సాగిపోయారు. ఎంతో మంది టీమిండియా ఆటగాళ్లకి అచ్చొచ్చిన వైజాగ్ పిచ్ పై వీరిద్దరూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో తొలి టెస్టులో బ్యాటింగ్ లో కొట్టొచ్చినట్టు కనిపించిన వైఫల్యం...ఈ సారి కనిపించలేదు. ఈ ఇద్దరూ సాధికారిక ఆటతీరుతో అభిమానులను అలరించారు. దీంతో సెంచరీలతో కదం తొక్కారు. తొలుత ఛటేశ్వర్ పూజారా 183 బంతుల్లో సెంచరీ చేయగా, వెంటనే 'నేను కూడా' అంటూ విరాట్ కోహ్లీ 154 బంతుల్లో సెంచరీ చేయడం విశేషం. 99 పరుగుల వద్ద ఎలాంటి బెరుకు లేకుండా సిక్సర్ తో పుజారా సెంచరీ పూర్తి చేయగానే, స్టేడియం కేరింతలతో హోరెత్తిపోయింది. దీంతో టీమిండియా రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.