: చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభకు అస్వస్థత


చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు చిత్తూరు మాజీ మేయర్ కఠారి అనురాధ భర్త మోహన్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆమెకు రక్తపోటు పడిపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

  • Loading...

More Telugu News