: గద్దెనెక్కక ముందే ట్రంప్ కు మొదలైన తలనొప్పి!


అమెరికా అధ్యక్ష పదవిని ఇంకా చేపట్టక ముందే, ట్రంప్ ముందస్తు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సంతకాల ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. వైట్ హౌస్ చీఫ్ స్ట్రాటజిస్ట్ గా స్టీవ్ బానస్ ను నియమించనున్నట్టు ట్రంప్ ప్రకటించగా, ఆయన వద్దే వద్దని 168 మంది డెమోక్రాట్ ప్రతినిధులు ట్రంప్ కు లేఖ రాశారు. బానన్ శ్వేత జాతీయుల పక్షపాతని, ఆయన నియామకాన్ని దేశమంతా వ్యతిరేకిస్తోందని వారు తెలిపారు. దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, విలువలకు కట్టుబడినవారికి మాత్రమే కీలకమైన పదవులు ఇవ్వాలని, తక్షణమే బానన్ నియామకాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించాలని డెమోక్రాటిక్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ లేఖపై కాలిఫోర్నియా నుంచి ఎన్నికైన డెమొక్రాట్ అమీబెరా కూడా సంతకం చేశారు. ఈ తాజా లేఖతో అధ్యక్ష పీఠంపై కూర్చోక ముందే ఆయనకు తలనొప్పులు మొదలైనట్లయింది.

  • Loading...

More Telugu News