: ఆన్ లైన్లో రూ. 2 వేల నోట్ల అమ్మకం... రూ. 3,500 నుంచి లక్షన్నర... స్పెషల్ ఇదే!
మీరు చదివింది నిజమే. ఈ కామర్స్ వెబ్ సైట్ ఈబేలో కొత్త రూ. 2 వేల నోట్లను లక్షన్నర రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. ఇక ఇప్పటికీ ఈ నోట్లను చూడని, జేబులో పెట్టుకోని వారి కోసం రూ. 3,500 ప్రీమియంతో విక్రయిస్తున్నారు. 2 వేల నోట్ల రూపాయల్లో 786 సీరియల్ నంబర్ తో మొదలైన నోట్లకు అత్యధిక డిమాండ్ కనిపిస్తోంది. 786786 నంబరుకు 1.51 లక్షల ధరను అమ్మకందారు నిర్ణయించాడు. ఆపై ఇదే సిరీస్ లోని పలు నంబర్లకు రూ. 3,500 నుంచి రూ. 50 వేల వరకూ ధర కనిపిస్తోంది. కాగా, ఈ విషయమై ఈబేను వివరణ కోరగా, స్వతంత్ర మార్కెట్ ప్లేస్ గా సేవలందిస్తున్న తాము, ఈ తరహాలో కరెన్సీ నోట్లను అమ్మకానికి పెట్టే వారిపై ఎటువంటి చర్యలనూ చేపట్టలేమని స్పష్టం చేశారు.