: హైదరాబాద్‌లో నూతన బిర్యానీ రెస్టారెంట్ వద్ద సందడి చేసిన రాశీఖన్నా
హైదరాబాద్, గచ్చిబౌలిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ బిర్యానీ రెస్టారెంట్ వద్ద ఈ రోజు సినీనటి రాశీఖన్నా సందడి చేసింది. రెస్టారెంటును ప్రారంభించిన అనంతరం అక్కడి బిర్యానీని తిని, వివిధ రకాల వంటకాలను కూడా రుచి చూసింది. అక్కడకు వచ్చిన తన అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. తాను నటించిన 'హైపర్' సినిమాకు అభిమానుల నుంచి మంచి స్పందన రావడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.