: హైదరాబాద్ లోని ఈ ‘చాయ్ డబ్బా’కు చిల్లరతో పనిలేదు.. క్రెడిట్/డెబిట్ కార్డు ఉంటే చాలు!
పెద్దనోట్లను చూస్తే ‘వద్దు బాబోయ్’ అని చిన్న వ్యాపారులే కాదు, బడా వ్యాపారులు కూడా అంటున్నారు. క్రెడిట్/డెబిట్ కార్డులతో షాపింగ్ చేయడం పెద్ద షాపులకే పరిమితమైన వేళ, ఒక చిన్న చాయ్ వాలా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎందుకంటే, తన వద్ద చాయ్ తాగాలంటే, చిల్లర లేకపోయినా ఫర్వాలేదు, క్రెడిట్/డెబిట్ కార్డు ఉంటే చాలని చెబుతున్నాడు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెం.12లో ఉన్న ఈ చాయ్ డబ్బాపై క్రెడిట్/డెబిట్ కార్డులను అనుమతిస్తామని రాసి ఉన్న ఒక పేపర్ అంటించి ఉండటం విశేషం.