: ఇకపై తెలుగులోనూ బీబీసీ సేవలు!
బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) సేవలు ఇకపై తెలుగులోనూ లభించనున్నాయి. బీబీసీ వరల్డ్ సర్వీస్ భారీ విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 11 భాషల్లో కొత్తగా సేవలు అందించనుంది. ఇందులో ఆసియా భాషలు తెలుగు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ వుండగా, ఆఫ్రికన్ భాషల్లో అఫాన్ ఒరామా, అమ్హారిక్, ఇగ్బో, కొరియన్, పిడ్గిన్, తిగ్రిన్యా, యోరుబా ఉన్నట్లు బీబీసీ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో అతిపెద్ద బ్యూరోను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ విస్తరణ ద్వారా 157 మందికి కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయని తెలుస్తోంది. ఈ తాజా విస్తరణతో బీబీసీ ఇంగ్లీషు సహా మొత్తం 40 భాషలకు బీబీసీ విస్తరిస్తుంది. ఈ సందర్భంగా బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ మాట్లాడుతూ, 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్ ప్రేక్షకులకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.