: సింధు ముందుకు... సైనా ఇంటికి!
చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ లో భారత్ కు ఈ రోజు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఒలింపిక్ సిల్వర్ మెడల్ విన్నర్ పీవీ సింధు తొలి రౌండ్ లో గెలిచి రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. చైనీస్ తైపీకి చెందిన లీ చియాపై 21-12, 21-16 తేడాతో గెలిచి, నెక్స్ట్ రౌండ్ లోకి అడుగు పెట్టింది. మరోవైపు, సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. అన్ సీడెడ్ థాయిలాండ్ క్రీడాకారిణి పోర్న్టిప్ బురానాప్రసేర్టుక్ చేతిలో ఆమె ఓటమి పాలయింది. తొలి గేమ్ ను 16-21తో కోల్పోయిన సైనా... రెండో రౌండ్లో పుంజుకుని 21-19తో గెలిచింది. అయితే మూడో రౌండ్ ను 14-21తో కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.