: నిజాయతీ గల వ్యక్తులకు మోదీ ‘కడక్ చాయ్’ తియ్యటిది: నానా పటేకర్


నిజాయతీ గల వ్యక్తులకు మోదీ ‘కడక్ చాయ్’ తియ్యగా ఉంటుందని పెద్దనోట్ల రద్దుపై ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన కథువా జిల్లాలో ఆయన పర్యటించాడు. సరిహద్దు కాల్పుల్లో వీరమరణం పొందిన భారత్ సైనికులకు నివాళులర్పించారు. అనంతరం నానాపటేకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దుపై మీడియా ప్రశ్నించగా పైవిధంగా ఆయన సమాధానమిచ్చారు. కాగా, ఇటీవల నిర్వహించిన బీజేపీ పరివర్తన్ ర్యాలీలో మోదీ తాను చాయ్ అమ్మిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. పేద ప్రజలు తనను ‘కడక్ చాయ్’ చేయమని అడిగేవారని, అయితే, సంపన్నులకు మాత్రం ఆ చాయ్ నచ్చేది కాదని మోదీ చెప్పడం విదితమే.

  • Loading...

More Telugu News