: ప్రజలకు ఏమని సమాధానం చెబుతారు?: పెద్దనోట్ల రద్దు ఇబ్బందులపై రాజ్యసభలో సీతారాం ఏచూరి
రాజ్యసభలో పెద్దనోట్ల రద్దుపై చర్చ కొనసాగుతోంది. ఈ అంశంపై సీపీఎం రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్బందులు ఎదుర్కుంటున్న సామాన్యులకు ఏమని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ముందస్తు చర్యలు తీసుకోకుండా ఇటువంటి చర్యలు ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. జాతీయ రహదారులపై సరకు రవాణా వాహనాలు వేల సంఖ్యలో ఆగిపోయాయని, మరోసారి పంట ఉత్పత్తుల ధరలు పడిపోయాయని చెప్పారు. అన్నీ ఆన్‌లైన్‌లో చూసుకోమని ప్రకటనలు చేస్తున్నారని, ఆ విధానం తెలియని సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.