: రద్దయిన నోట్లను మారుస్తామంటూ రూ.50 లక్షలతో పరారైన ఇద్దరు వ్యక్తులు.. హైదరాబాద్‌లో ఘటన
రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవడం కోసం ప్రజలు, నల్లధనం వ్యక్తులు పడుతున్న ఇబ్బందులను ఆసరాగా చేసుకొని కిలాడీగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో ఇటువంటి మోసమే ఈ రోజు వెలుగులోకి వచ్చింది. తన వద్ద ఉన్న రద్దయిన నోట్లను మారుస్తామని చెప్పి, ఇద్దరు వ్యక్తులు ఆ డబ్బును తీసుకొని ఉడాయించారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే, పోలీసులు ఫిర్యాదు దారుడి పేరును చెప్పలేదు.