: పుట్టంరాజు కండ్రిగలో సచిన్.. గ్రామస్థుల ఆత్మీయస్వాగతం
క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ తన దత్తత గ్రామంలో అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా పుట్టంరాజు కండ్రిగకు ఆయన ఉదయం 11 గంటల తరువాత చేరుకున్నారు. గ్రామస్థుల ఆత్మీయస్వాగతం అందుకున్న సచిన్... 1.15 కోట్ల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. అనంతరం జిల్లాస్థాయి అధికారులతో స్వచ్ఛభారత్ అభియాన్ పై సమీక్ష నిర్వహించారు. అనంతరం గ్రామం మొత్తం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సంభాషించారు.