: మనీ ల్యాండరింగ్, ఫెరా యాక్ట్ లన్నీ కాంగ్రెస్సే తెచ్చింది... మీరే చేసినట్టు ఫీలవ్వకండి: ఆనంద్ శర్మ
నల్లధనం నియంత్రణకు అంతా తామే చేసినట్టు గొప్పలు చెప్పుకోవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ బీజేపీ నేతలకు సూచించారు. నల్లధనం నియంత్రణకు గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ ఎన్నో చర్యలు తీసుకున్నాయని అన్నారు. అందులో భాగంగానే తాము మనీ ల్యాండరింగ్ యాక్ట్, ఫెరా నిబంధనలు ఇలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ఆయన చెప్పారు. వాటి ఆధారంగానే ఇప్పటికీ నల్లధనాన్ని నియంత్రిస్తున్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో నల్లధనం అంతమైపోతే... 2000 రూపాయల నోటు ఎందుకని ఆయన నిలదీశారు. 2000 నోటు ప్రవేశపెట్టడం ద్వారా నల్లధనంపై కేంద్రం వ్యూహం తెలియడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.