: పగలు భక్తి మార్గం... రాత్రి చోరీల మార్గం!
పగలంతా పూజారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మంచిని బోధించే అతను... రాత్రి కాగానే వేషం మార్చేస్తాడు. దొంగతనాలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతాడు. వివరాల్లోకి వెళ్తే, ద్వారకకు చెందిన రామ్ కుమార్ ఢిల్లీలోని ఓ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. అంతేకాదు, ఢిల్లీలోని పలు కాలనీల్లో భగవద్గీత పారాయణం చేస్తుంటాడు. నిన్న రాత్రి తన మిత్రుడు హరీష్ తో కలిసి బైక్ పై వస్తుండగా, పోలీసులు ఆపి బైక్ కాగితాలు ఇవ్వాలని అడిగారు. వారి వద్ద డాక్యుమెంట్ లేకపోవడంతో... బండి నెంబర్ ఆధారంగా ఆ బైక్ ను గుర్తించారు. గత అక్టోబర్ లో ఆ బైక్ చోరీకి గురైందని గుర్తించి, వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. దీంతో, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పగలు పూజరిగా పని చేస్తూ, రాత్రిపూట బైక్ లను దొంగతనం చేస్తున్నాడని తెలిసింది. ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి 8 బైక్ లను చోరీ చేసినట్టు విచారణలో తేలింది. పోలీసుల ముందు వీరిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. తాను చేసిన తప్పుకు దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడని రామ్ కుమార్ పోలీసులతో చెప్పడం విశేషం. మెట్రో స్టేషన్ల వద్ద బైక్ లను దొంగిలించేవారిమని... డూప్లికేట్ తాళాలతో లాక్ ఓపెన్ చేసి, బైక్ లను ఎత్తుకువెళ్లేవాళ్లమని చెప్పాడు.