: రూ. 90 కోట్ల విలువైన నగల ధగధగల మధ్య బ్రాహ్మణి... మీరూ చూడండి!
రూ. 90 కోట్ల విలువైన బంగారం. పైగా అత్యంత అరుదైన వజ్రాలు, ఖరీదైన రాళ్లు పొదిగిన బంగారు ఆభరణాలైతే... నేడు పెళ్లి చేసుకోబోతున్న గాలి జనార్దనరెడ్డి కుమార్తె బ్రాహ్మణి, అలా 90 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను ధరించి మెరిసిపోయింది. చిలకాకుపచ్చ రంగు చీరలో, తలపై నుంచి బంగారు తీగలతో నేసిన పరదా, పాపటిబిళ్ల, మూడు వరుసలతో వేళ్లాడుతున్న మాటీలు, మెడ నుంచి నడుము వరకూ విలువైన రాళ్లు, వజ్రాలు పొదిగిన, పదికి పైగా హారాలు, వడ్డాణం, గాజులు తదితరాలను ధరించిన బ్రాహ్మణి, బంగారంతో తయారు చేసిన పర్సును కూడా పట్టుకుని నిలిచిన ఫోటోను మీరూ చూడవచ్చు.