: గాలి ముద్దుల తనయ బ్రాహ్మణి కట్టుకున్న చీర ఖరీదు రూ. 17 కోట్లు, ధరించిన నగల విలువ రూ. 90 కోట్లు
అంగరంగ వైభవంగా ప్రారంభమైన గాలి జనార్దన రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహానికి ప్రత్యేక పెళ్లి పట్టు చీర తయారైంది. ఓ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఎన్నో రోజుల పాటు శ్రమించి తయారు చేసిన ఈ చీర ఖరీదు రూ. 17 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఇక బ్రాహ్మణి ధరించనున్న నగల ఖరీదు రూ. 90 కోట్లని సమాచారం. సంచలనాలకు కేంద్రంగా నిలుస్తున్న ఈ వివాహం గురించిన ప్రతి సమాచారమూ అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. కాగా, ఓ కన్నడ చానల్ లో పెళ్లిని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు కెమెరామెన్లు వివాహ వేదిక వద్ద కెమెరాల వెనుక ఉండి మొత్తం తతంగాన్ని చిత్రీకరిస్తుండటం గమనార్హం.