: బ్రేకప్స్ మేలు చేస్తాయి... కానీ సరిగ్గా చూడాలి: హాలీవుడ్ నటుడు


బ్రేకప్స్ గుండెను బద్దలు చేస్తాయి, జీవితంపై విరక్తి కలిగిస్తాయని ఎవర్ని అడిగినా చెబుతారు. కానీ వాస్తవానికి హృదయాన్ని బద్దలు చేసే బ్రేకప్స్ మనకు మేలు చేస్తాయని ప్రముఖ హాలీవుడ్ నటుడు జేక్ గెలిన్ హాల్ తెలిపాడు. న్యూయార్క్ లో ఆయన మాట్లాడుతూ, గుండెను బద్దలు చేసే సంఘటనలే మనమేమిటో నిరూపించుకునేలా చేస్తాయని అన్నాడు. బ్రేకప్సే తనను మానసికంగా బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయని పేర్కొన్నాడు. అందరి బ్రేకప్స్ ఒకేలా ఉండవని, బ్రేకప్ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్కశైలి అని, ఎవరి అనుభవం వారికే తెలుస్తుందని తెలిపాడు. సామాజిక, రాజకీయ, మానసిక సంబంధాలు ఏవైనా సరే బ్రేకప్ అయినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని, ఆ సందర్భాన్ని, అందుకు దారితీసిన పరిస్థితులను గమనిస్తే ఎవరైనా మరింత బలంగా తయారవుతారని తెలిపాడు. హృదయం ముక్కలైనప్పుడు దాని గురించే ఆలోచించడం కంటే కూడా, వెనుదిరిగి చూసి అవలోకనం చేసుకుంటే... మనమేంటి? అన్న విషయం సుస్పష్టంగా అర్థమవుతుందని జేక్ హాల్ చెప్పాడు. అందుకే బ్రేకప్స్ ఎవరికైనా మంచే చేస్తాయి తప్ప హాని చేయవన్నది తన అభిప్రాయమని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News