: ప్రేమించుకున్నామంటూ కోర్టుకెక్కిన ఇద్దరు అమ్మాయిలు... సాయపడుతున్న హిజ్రాలు!
తామిద్దరం ప్రేమించుకున్నామని, సహజీవనం చేసేందుకు అనుమతించాలని కోరుతూ ఇద్దరు కర్ణాటక యువతులు తమిళనాడులోని మధురై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆసక్తితో పాటు విస్తుపోయేట్టు చేస్తున్న ఈ కేసు వివరాల్లోకి వెళితే, బెంగళూరుకు చెందిన వరుణ్ అలియాస్ వెరోనికా (22), మాలిని (19)లకు ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రకృతికి విరుద్ధంగా ప్రేమలో పడ్డారు. వీరి బంధాన్ని పెద్దలు ఎంతమాత్రమూ అంగీకరించలేదు. దీంతో తమిళనాడుకు పారిపోయి వచ్చి వేలాంకణి ప్రాంతంలో ఉండసాగారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, వీరిని బలవంతంగా తీసుకువెళ్లి విడివిడిగా ఉంచారు. తిరిగి కలుసుకున్న వీరు, మధురై వచ్చి, హిజ్రా నేత భారతి కన్నమ్మను కలసి సహకారం కోరగా, ఆమె, నిన్న మధురై కోర్టుకు తీసుకువచ్చి పిటిషన్ వేయించారు. ఈ కేసు నేడు విచారణకు రానుంది.