: సత్తుపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ బంద్ కు పిలుపు


తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో రెవెన్యూ డివిజన్ సత్తుపల్లిని జిల్లా కేంద్రం చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో 48 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ ను విజయవంతం చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన జేఏసీ నేతలు ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకుని, బస్సులను ఆపేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పర్యవసానంగా పోలీసులు, జేఏసీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News