: ఈ సినిమా కెరీర్ కు మరో బీజం వేసింది: నాగచైతన్య
తన కెరీర్ లో 'ఏం మాయ చేశావే', 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలు రెండూ రెండు విభిన్నమైన చిత్రాలుగా నిలిచాయని యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య తెలిపాడు. ఈ సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ, 'ఏం మాయ చేశావే' రొమాంటిక్ సినిమాలు చేసే ధైర్యాన్నిచ్చిందని అన్నాడు. యాక్షన్ సినిమాలు చేసినప్పటికీ, అవి సరైన ప్లాట్ ఫాం తయారు చేయని సమయంలో మళ్లీ 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా 'చైతూ యాక్షన్ సినిమాలకు కూడా సరిపోతాడనే' ధైర్యాన్ని ఇచ్చిందని అన్నాడు. విశాఖపట్టణం నుంచి కన్యాకుమారి; అక్కడి నుంచి మహారాష్ట్ర వరకు సాగిన ప్రయాణంలోని సంఘటనలే ఈ సినిమా అని చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ లో కూడా విశాఖపట్టణం నుంచి మహారాష్ట్ర వరకు వెళ్లడం తనకు నచ్చిందని అన్నాడు. అంతకు ముందు తనకు లాంగ్ డ్రైవ్ లు చాలా ఇష్టమని, ఈ సినిమాలో కూడా లాంగ్ డ్రైవ్ ఉండడంతో తనను మరింత ఉత్సాహపరచిందని చెప్పాడు. సినిమాలో సందర్భోచితంగా వచ్చే సన్నివేశాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని నాగచైతన్య తెలిపాడు. ఈ సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.