: వారం రోజుల్లో 5 లక్షల కోట్ల డిపాజిట్
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో బ్యాంకుల్లోకి మనీ డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయి. తమ వద్ద ఉన్న పాత నోట్లన్నింటినీ పట్టుకుని బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు జనాలు. వాటిని కొత్త నోట్లతో మార్చుకోవడమో లేక బ్యాంకుల్లో డిపాజిట్ చేయడమో చేస్తున్నారు. ఈ క్రమంలో, కేవలం వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా రూ. 5 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఈ వివరాలను బ్యాంక్స్ అసోసియేషన్ వెల్లడించింది. మొత్తం 16 కోట్ల మంది ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారని తెలిపింది.