: ప్రత్యేక హోదా అంశం చెల్లని రూ.500, రూ.1000 నోట్లు లాంటిదే: సుజనా చౌదరి


ఏపీకి ప్రత్యేక హోదా అంశం చెల్లని రూ.500, రూ.1000 నోట్లు లాంటిదేనని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఇంకా ప్రత్యేక హోదా అంశంపై పట్టుబడితే ఎటువంటి లాభం ఉండదని, రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని, ప్రత్యేక ప్యాకేజ్ కు చట్టబద్ధతపై పట్టుబడతామని, పోలవరం ప్రాజెక్టు నిధులు త్వరగా వచ్చేలా పోరాడతామని, విశాఖ రైల్వే జోన్ అంశానికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ఏమైనా, వారంలోగా ‘పోలవరం’ నిధులపై స్పష్టత వస్తుందన్నారు. నోట్ల రద్దు వల్ల సామాన్యుల ఇబ్బందులను కేంద్రం ద‌ృష్టికి తీసుకెళ్తామని, లెక్కల్లోకి రాని డబ్బులు వెలుగులోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చంటూ ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం, మరో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, రూ.2 వేల నోట్ల చలామణిపై కేంద్రం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. నోట్ల రద్దు వల్ల ఏర్పడిన సమస్యలను పార్లమెంటులో చర్చిస్తామన్నారు.

  • Loading...

More Telugu News