: తెలంగాణలో బాబా రాందేవ్ పతంజలి పరిశ్రమ


ఆయుర్వేద ఉత్పత్తులలో దూసుకుపోతున్న పతంజలి సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమను తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని టీఆర్ఎస్ ఎంపీ కవిత తెలిపారు. ఈ రోజు పతంజలి సీఈవో బాలకృష్ణ నిజామాబాద్ జిల్లాలోని లక్కంపల్లి సెజ్ కు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడుతూ, జిల్లాలో పసుపు ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. పతంజలి సీఈవో బాలకృష్ణ మాట్లాడుతూ, రైతులకు లబ్ధి చేకూర్చేందుకు పతంజలి సహకరిస్తుందని తెలిపారు. అంతేకాకుండా, లక్కంపల్లిలో రైతులతో పసుపు పంట గురించి తెలుసుకున్నారు. త్వరలోనే పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కాగా, నిజామాబాద్ జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేయాలంటూ నెల కింద బాబా రాందేవ్ కు కవిత విన్నవించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News