: ‘పెద్దనోట్ల రద్దు'పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్పై ఈ రోజు సుప్రీంకోర్టు వాదనలు వింది. అనంతరం పెద్దనోట్ల రద్దుపై స్టేకు నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రానికి సూచించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. నగదు విత్ డ్రా పరిమితిని మరింత ఎందుకు పెంచలేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు ఇబ్బందులు పడకూడదని వ్యాఖ్యానించింది.