: సరిహద్దుల్లో మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్
పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండడంతో ఏడుగురు పాకిస్థాన్ రేంజర్లను రెండు రోజుల క్రితం భారత జవాన్లు హతమార్చిన సంగతి తెలిసిందే. ప్రతీకారంతో రగిలిపోతున్న పాకిస్థాన్ మళ్లీ ఈ రోజు జమ్ముకశ్మీర్‌లోని సుందర్ బనీ సెక్టార్లో కాల్పులకు తెగబడింది. పాక్ రేంజర్ల కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. మరోవైపు పాకిస్థాన్ భద్రతా దళాలతో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితిపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు.