: సచిన్ ఇంట్లో గిల్ క్రిస్ట్ పుట్టిన రోజు వేడుకలు
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గిల్ క్రిస్ట్ తన పుట్టిన రోజు వేడుకలను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో జరుపుకున్నాడు. ముంబైలోని సచిన్ నివాసంలో గిల్లీ 45వ బర్త్ డే సెలబ్రేషన్స్ నిన్న ఆడంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా గిల్ క్రిస్ట్ తో బర్త్ డే కేక్ ను కట్ చేయించాడు సచిన్. గిల్లీ అని రాసిఉన్న కేక్ తో సచిన్ తనను ఆశ్చర్యానికి గురి చేశాడని గిల్ క్రిస్ట్ ట్వీట్ చేశాడు. "థ్యాంక్స్ ఛాంపియన్... హ్యూజ్ థ్యాంక్స్ ఫర్ ది కేక్" అని తెలిపాడు. సచిన్ ఇంట్లో తన పుట్టిన రోజును జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. అంతేకాకుండా, సచిన్ ను హత్తుకున్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు.