: షారుఖ్ తో నటిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు.. అన్నీ పుకార్లే: ఐశ్వర్యరాయ్
కరణ్ జొహార్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్‌తో కలసి ఓ సినిమాలో ఐశ్వర్యరాయ్ నటించనున్నట్టు వార్తలు రావడంతో ఈ అంశంపై ఐష్ స్పందించింది. ఆ వార్తల్లో నిజంలేదని తేల్చి చెప్పి, అవి పుకార్లే అని కొట్టి పారేసింది. తన తదుపరి చిత్రం కోసం ప్రస్తుతం తాను కథను వినేపనిలో ఉన్నానని, తన అభిమానులకు తన తదుపరి చిత్రంతో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పింది. మీడియా అడిగిన ప్రశ్నకి ఐశ్వర్యరాయ్ సమాధానం చెబుతూ... తాను సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా లేనని, తనకు ఇప్పటివరకూ సోషల్ మీడియాను ఉపయోగించాల్సిన అవసరం కూడా రాలేదని చెప్పింది. ఒకప్పుడు వాటిల్లో సెలబ్రెటీలకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారనే అంశంపై నెటిజన్లు మాట్లాడుకునేవారని, ఇప్పుడు మాత్రం ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో సెలబ్రెటీలు చేసే పోస్టుల గురించి చర్చించుకుంటున్నారని ఐశ్వర్యరాయ్ చెప్పింది. తనకు సోషల్‌మీడియా మీద ఎలాంటి వ్యతిరేకత లేదని అయితే, వాటిల్లో తాను అంతగా యాక్టివ్‌గా లేనని పేర్కొంది. తనకు ఒకవేళ సోషల్‌మీడియా అవసరమనిపిస్తే మున్ముందు అందులో యాక్టివ్‌గా కనిపిస్తానని చెప్పింది.