: ఉక్రెయిన్ పార్లమెంట్ లో యాక్షన్ ఎపిసోడ్.. తోటి సభ్యుడిపై పిడిగుద్దులు కురిపించిన ఎంపీ!


ఉక్రెయిన్ పార్లమెంట్ రణరంగాన్ని తలపించింది. చట్టాలు చేయాల్సిన ఎంపీ పిడిగుద్దులు కురిపించాడు. వివరాల్లోకి వెళ్తే, యురీ బోక్యో అనే ఎంపీని క్రెమ్లిన్ (రష్యా)కి ఏజెంటుగా పనిచేస్తున్నావంటూ ఒలెగ్ ల్యాష్కో అనే మరో ఎంపీ విమర్శించారు. దీంతో, ఆగ్రహం కట్టలు తెంచుకున్న యురీ బోక్యో అతనిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. మిగతా సభ్యులు అతడిని శాంతింపజేయడంతో, పరిస్థితి అదుపులోకి వచ్చింది. గొడవ జరిగిన తర్వాత కూడా యురీని ఒలెగ్ ల్యాష్కో విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో, ఒలెగ్ ను హౌస్ ను వదిలి వెళ్లమనండంటూ యురీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్ పార్లమెంటులో ఎంపీలు అడపాదడపా కొట్టుకోవడం సాధారణమే. ఎంహెచ్-17 విమానం 2014లో కూలిపోయినప్పుడు కూడా ఎంపీలు ఇలాగే పిడిగుద్దులు కురిపించుకున్నారు.

  • Loading...

More Telugu News