: ఎస్‌బీఐ ఖాతాదారులకు చిల్లర కష్టాలు తీరినట్టే.. ఇక నుంచి ఏటీఎంలలో రూ.20, రూ.50 నోట్లు కూడా!
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త. ఇక నుంచి ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి రూ.2000, రూ.500, రూ.100 నోట్లే కాదు.. రూ.20, రూ.50 నోట్లు కూడా తీసుకోవచ్చు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎస్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ఎస్‌బీఐ ఏటీఎంలలో రూ.20, రూ.50 నోట్లు కూడా ప్రవేశపెడతామని, అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని ఆమె వివరించారు. ఇప్పటి వరకు ఇంత తక్కువ విలువైన కరెన్సీని ఏటీఎంలలో పెట్టలేదని పేర్కొన్నారు. చిన్న నోట్లు దొరక్క ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వీలైనంత త్వరగా చిన్న నోట్లను ఏటీఎంలలో ఉంచాలని భావిస్తున్న సంస్థ ఏటీఎంల వద్ద రద్దీ తగ్గిన వెంటనే ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది.