: ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దును ప్రజలంతా అంగీకరించారని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సామాన్య ప్రజలు ప్రభుత్వం వెంట ఉన్నారని, దీనిని అంతా స్వాగతిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంలో అంతా ఏకతాటిపై నిలవాలని, ప్రతిపక్షాల ఉచ్చులో పడరాదని ఆయన హితబోధ చేసినట్టు తెలుస్తోంది.