: అద్దెకు టీఎస్ ఆర్టీసీ బస్సులు రెడీ!


నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు అమలుచేస్తోంది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీకి చెందిన అన్ని రకాల బస్సులను అద్దెకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇచ్చేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అందుబాటులో ఉన్న అన్ని రకాల బస్సులను అద్దెకు ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఆన్ లైన్, ప్రత్యేక యాప్ ద్వారా ఈ బస్సులను అద్దెకు ఇవ్వనున్నారు. అంతే కాకుండా ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ద్వారా కూడా బస్సులను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News