: చిత్రంగా అవుటైన డేవిడ్ వార్నర్!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ చరిత్రలో ఎవరూ అవుట్ కాని విధంగా అవుటై చరిత్ర నెలకొల్పాడు. వివరాల్లోకి వెళ్తే... హోబర్ట్ నగరంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కైల్ సంధించిన 23వ ఓవర్ లో ఓ బంతిని ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ లెగ్ సైడ్ దిశగా తరలించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బ్యాటుకు తగలని బంతి, అతని తొడను తాకి, ఆ వెంటనే అతని మోచేతిని వేగంగా తాకింది. అంతే వేగంతో వెనక్కి వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో వార్నర్ తో పాటు అంతా ఆశ్చర్యపోయారు. క్రికెట్ చరిత్రలోనే చిత్రమైన అవుట్ గా అంతా దీనిని పేర్కొంటున్నారు.