: బ్యాంకు ముందు జుట్టు పట్టుకొని కొట్టుకున్న ఇద్దరు మహిళలు
నల్లధనాన్ని, నకిలీ నోట్లను నిరోధించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్త నోట్లను పొందడానికి దేశ వ్యాప్తంగా ఖాతాదారులు బ్యాంకుల ముందు బారులు తీరి కనిపిస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో వారిలో సహనం నశించి బ్యాంకు సిబ్బందితో గొడవలు కూడా పడుతున్నారు. అయితే, ఈ రోజు బీహార్ ఓ బ్యాంకులో డబ్బు తీసుకోవడానికి వచ్చి, బ్యాంకు ముందు క్యూ కట్టిన ఇద్దరు మహిళలు పరస్పరం జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. గట్టిగా ఒకరిజుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకుంటున్న వారిద్దరినీ విడిపించేందుకు బ్యాంకు సిబ్బంది ప్రయత్నించారు. అయితే, వారిని ఆపడం వారి వల్ల కాలేదు. దీంతో క్యూలో ఉన్న వారు ప్రయత్నించారు.. ఎట్టకేలకు అతికష్టం మీద వారిద్దరినీ అంతా కలిసి విడదీశారు.