: హెలికాప్టర్ ద్వారా బొకారోకు నోట్ల తరలింపు
500, 1000 రూపాయల నోట్ల రద్దును తీర్చేందుకు ఆర్బీఐ సరికొత్త నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం, ఆర్బీఐ ఏర్పాట్లపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీనిపై ఆర్బీఐ వేగంగా స్పందిస్తోంది. జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారోలోని బ్యాంకులు, ఏటీఎంలకు హెలికాఫ్టర్ల ద్వారా కొత్త నోట్లను తరలిస్తోంది. హెలికాప్టర్ ను ప్రకృతి విపత్తులు, అత్యవసర సమయాల్లో మాత్రమే వినియోగిస్తుంటారు. తాజాగా ఆర్థిక ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొనడంతో ఆర్బీఐ కొత్త కరెన్సీని హెలికాఫ్టర్ ద్వారా తరలిస్తోంది.