: జయలలితపై నిప్పులు చెరిగిన స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై డీఎంకే నేత, కరుణానిధి కుమారుడు స్టాలిన్ నిప్పులు చెరిగారు. నోట్ల సమస్యతో ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే... జయలలిత కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా, ఎన్నికలపైనే దృష్టి సారించారని విమర్శించారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలిగేలా ఆమె కనీసం రెండు మాటలు కూడా మాట్లాడలేకపోయారని... తన స్వలాభం కోసం మాత్రం ప్రకటన విడుదల చేశారని అన్నారు. ప్రజల ప్రార్థనల వల్లే తాను పునర్జన్మ పొందానని... పార్టీకి కూడా అవే ఆశీర్వాదాలు అందించి, ఎన్నికల్లో విజయాన్ని అందించాలని జయ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. త్వరలోనే పూర్తిగా కోలుకుని, పాలన కొనసాగిస్తానని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలోనే జయపై స్టాలిన్ మండిపడ్డారు.