: విదేశాల్లో ఎవ‌రెవ‌రికి న‌ల్ల‌ధ‌నం ఉందో ప్రధాని మోదీ వ‌ద్ద జాబితా ఉంది: సీతారాం ఏచూరి


న‌ల్ల‌ధ‌నంలో 90 శాతం విదేశాల్లోనే ఉంద‌ని సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి అన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... విదేశాల్లో ఎవ‌రెవ‌రికి న‌ల్ల‌ధ‌నం ఉందో మోదీ వ‌ద్ద జాబితా ఉందని, ఆ జాబితా ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌డం లేదని ప్ర‌శ్నించారు. కొత్త క‌రెన్సీ తీసుకురావ‌డం ప‌ట్ల‌ దేశంలో ఎవరూ సంతృప్తి వ్యక్తం చేయ‌ట్లేదని, ఇక కొత్త క‌రెన్సీని ప్ర‌వేశ‌పెట్టడంలో లాభం ఏమిటని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉగ్ర‌వాదుల‌కు నిధుల‌ త‌ర‌లింపును క్యారీ బ్యాగుల్లో ఎవ‌రూ చేయ‌బోరని, ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హించేవారు వారికి ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ ద్వారానే నిధులు స‌మ‌కూరుస్తారని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకొని వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

  • Loading...

More Telugu News