: మరో సంచలనానికి సిద్ధమవుతున్న రిలయన్స్


ఇప్పటికే జియో 4జీ సేవలతో మొబైల్ రంగాన్ని ఓ కుదుపు కుదిపిన రిలయన్స్... ఇప్పుడు మరో సంచలనం దిశగా అడుగులు వేస్తోంది. బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్ సేవల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. జియో టీవీ ద్వారా 360కి పైగా ఛానళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో కనీసం 50 హెచ్ డీ ఛానళ్లు ఉంటాయి. హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ తో డీటీహెచ్ తో పాటు, హైస్పీడ్ ఇంటర్నెట్ ను కూడా అందించనుంది. దీనికోసం సంబంధించి సెట్ టాప్ బాక్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్ బాక్స్ అందించనుంది. అంతేకాదు, వినియోగదారులు తమకు కావాల్సిన కార్యక్రమాలను జియో సర్వర్లలో సేవ్ చేసుకోవచ్చు. మాటలతో పని చేసే రిమోట్ తో ఛానల్స్ మార్చుకునే సదుపాయాన్ని కల్పించనుంది. వీటితో పాటు మరి కొన్ని విప్లవాత్మకమైన మార్పులతో వినియోగదారుల చెంతకు రిలయన్స్ రానుందని సమాచారం. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో డీటీహెచ్, బ్రాండ్ బ్యాండ్ సేవలను రిలయన్స్ అందిస్తోంది.

  • Loading...

More Telugu News