: ఏపీకి వచ్చిన రూ. 500 నోట్లు... తెలంగాణలో మాత్రం కనిపించడం లేదు!
ఐదు రోజుల నాడు రూ. 2 వేల కొత్త కరెన్సీ నోట్లు మార్కెట్లోకి రాగా, నిన్నటి నుంచి రూ. 500 కొత్త కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే ప్రజల చేతుల్లోకి 500 నోట్లు వచ్చి చేరాయి. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాలోని అత్యధిక ఎస్బీఐ బ్యాంకుల్లోకి కొత్త నోట్లు చేరాయి. ఇదే సమయంలో తెలంగాణలో రూ. 500 నోట్లు ఒక్క చోట కూడా కనిపించలేదు. కాగా, కోల్ కతా నుంచి రైల్వే వాగన్ లో కొత్త నోట్లు విశాఖ చేరాయని వెల్లడించిన అధికారులు, మంగళవారం నాటికి తెలంగాణలోని బ్యాంకుల్లోకి రూ. 500 నోట్లు అందిస్తామని స్పష్టం చేశారు. కాగా, ముద్రణాకేంద్రాల నుంచి 50 లక్షల రూ. 500 కొత్త నోట్లు ఆర్బీఐకి బట్వాడా అయిన సంగతి తెలిసిందే. వీటిని వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులకు పంపినట్టు ఆర్బీఐ పేర్కొంది.