: బ్యాంకుల ముందు క్యూలో నిలబడిన వారికి ఉచితంగా పిజ్జా అందిస్తున్న పిజ్జాహట్!
పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు బ్యాంకుల ముందు బారులు తీరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు కనపడుతుండడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఏటీఎం కేంద్రాల్లోనే డబ్బు అందుబాటులో ఉంది. అయితే, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల ముందు బారులు తీరిన ప్రజల ఆకలిని తీర్చాలని పిజ్జా హట్ నిర్ణయించుకుంది. క్యూలో నిలబడిన వారికి ఉచితంగా పిజ్జాను అందిస్తోంది. ఢిల్లీ, గుర్ గావ్, ముంబయి, పూణె, బెంగళూరు నగరాల్లోని ఐసీఐసీఐ, కార్పొరేషన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాల ముందు బారులు తీరిన వారికి ఉచితంగా పిజ్జాను అందిస్తున్నట్లు పిజ్జాహట్ నిర్వాహకులు తెలిపారు. పిజ్జాలను ఉచితంగా అందించడానికి మొత్తం ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.