: మిగిలింది 49 ఓవర్లు... భారత్ ముందు ఊరిస్తున్న 310 పరుగులు
తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు తన రెండవ ఇన్నింగ్స్ ను 3 వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఉదయం నుంచి బ్యాటింగ్ చేస్తున్న జట్టులో కెప్టెన్ కుక్, 76వ ఓవర్ లో 130 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్ లో అవుట్ కావడంతో ఆ జట్టు తమ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలిపి ఇంగ్లండ్ లీడ్ 309 పరుగులకు చేరగా, 310 పరుగుల విజయ లక్ష్యం, లేదంటే మ్యాచ్ ని డ్రా చేసుకునేందుకు భారత జట్టు మరికాసేపట్లో బరిలోకి దిగనుంది. నేటి ఆట ముగిసేందుకు మరో 49 ఓవర్లు మిగిలున్నాయి. వన్డేల పరంగా చూస్తే 49 ఓవర్లలో 310 స్కోరు పెద్ద కష్టం కాదు. వికెట్లుంటే విజయం సాధ్యమే. కానీ ఇది టెస్టు మ్యాచ్. ఏ మాత్రం అటూ ఇటు అయినా, భారత్ ఘోరంగా ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక భారత జట్టు తన ముందు ఆకర్షణీయమైన స్కోరున్న వేళ, విజయానికి ట్రై చేస్తారో, లేక డ్రా కోసమే ప్రయత్నిస్తారో మరికాసేపట్లో తెలిసిపోతుంది.